బొండు మల్లెలు
ఈ చిన్న కథ ప్రపంచాన్ని చూసే నా దృక్పథం ని పూర్తి గా మార్చేసింది.. షార్ట్ గా స్టోరీ చెప్తే… మల్లె పూలు కి మార్కెట్ లో మంచి రేటు ఉంది అని రచయత , ఖాళీ గా ఉన్న తన ఇంటి పెరడు లో ఈ పూలు పెంచితే మంచి లాభం వస్తుంది అనుకుంటాడు… ఎలాగూ డబ్బు ఉన్న వాళ్ళే ఈ మల్లె పూలు కొంటారు కాబట్టి వాళ్ళకి ఈ మల్లె పూలు ఎక్కువ రేట్ కి అమ్మినా, వాళ్ళని ఇలా దోపిడీ చేసినా పెద్ద అన్యాయం ఏం కాదు అనుకుంటాడు… కానీ గోతులు తీయటానికి ఓ మనిషి అవసరం పడితే, పని ఉందా బాబు అనుకుంటూ పొట్ట వెన్నుకు అంటుకుపోయిన ఓ తాత ఎదురు వస్తాడు… తమకి తోసింది ఇయ్యిండి బాబు అనగానే , తాత అవసరం లో తనకి ఓ అవకాశం కనపడి.. చాలా తక్కువ కి బేరం ఆడతాడు… పని అవసరం కాబట్టి తాత కూడా మారు మాట్లాడకుండా చిత్తం బాబూ ! కానీ మధ్యాన్నం కాసిన్ని గంజి నీళ్ళు పోయమంటాడు… ఎలాగూ తక్కువ కే పనికి కుదిరాడు అని సరేలే అని రచయత ఒప్పుకుంటాడు… చివరలో పేచీ ఏమైనా పెడతాడు ఏమో అని అనుకున్నా..పని ఐపోయాక ఇచ్చినంత తీసుకుని తాత వెళ్ళిపోతాడు… కానీ మళ్...